Barrelakka: లోక్‌సభ బరిలో బర్రెలక్క.. పోటీ ఎక్కడి నుంచి అంటే…

సోషల్‌ మీడియాలో ఒక్క వీడియోతో బర్రెలక్క సంచలనం అయ్యారు. డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానని వీడి సోషల్‌ మీడియాలో పోస్టు చేసి ఫేమస్‌ అయ్యారు.

Written By: Raj Shekar, Updated On : April 24, 2024 10:39 am

Barrelakka

Follow us on

Barrelakka: గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష. కొల్హాపూర్‌ నుంచి పోటీ చేసిన ఆమె గెలవక పోయినా.. నాటి అధికార బీఆర్‌ఎస్‌ను, ప్రతిపక్ష కాంగ్రెస్‌ను టెన్షన్‌ పెట్టారు. తెలంగాణలో యువత ఆమెకు మద్దతుగా నిలిచారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేశారు. ఎన్నికల ఖర్చుల కోసం పలువురు ఆర్థిక సాయం చేశారు. అయితే ప్రచారం చేసిన వారికి కొల్హాపూర్‌లో ఓటుహక్కు లేకపోవడంతో ఓడిపోయారు. లేకుంటే.. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇబ్బంది పడేవారే. అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా సంచలనం రేపిన బర్రెలక్క తాజాగా ఆమె లోక్‌సభ బరిలో దిగుతున్నారు. నాగర్‌కర్నూల్‌(ఎస్సీ) నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈమేరకు మంగళవారం(ఏప్రిల్‌ 23న) నామినేషన్‌ దాఖలు చేశారు.

డిగ్రీ చదివినా.. ఉద్యోగం రాలేదని..
సోషల్‌ మీడియాలో ఒక్క వీడియోతో బర్రెలక్క సంచలనం అయ్యారు. డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానని వీడి సోషల్‌ మీడియాలో పోస్టు చేసి ఫేమస్‌ అయ్యారు. ఈ వీడితో బర్రెలక్కగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఫాలోవర్స్‌ పెరగడంతో తర్వాత సోషల్‌ మీడియాలో నిరుద్యోగ సమస్యపై తనగొంతు వినిపించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నుంచి ఇండిపెండెంట్‌గా నామినేష¯Œ వేసి అందరి దృష్టిని ఆకర్షించారు.

కేవలం 5,754 ఓట్లే..
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కకు కేవలం 5,754 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే బర్రెలక్క మాత్రం నైతికంగా తానే విజయం సాధించానన్నారు. ఒక్క రూపాయి తీసుకోకుండా ఇంత మంది తనకు ఓటు వేశారని తెలిపారు. తాను గెలిచినట్లే భావిస్తున్నానని పేర్కొన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తా అని చెప్పారు. అయితే ఇటీవలే ఆమ పెళ్లి చేసుకున్నారు. దీంతో ఎన్నికల్లో ఇక పోటీ చేయరని అంతా అనుకున్నారు. కానీ నాడు చెప్పినట్లుగానే లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

బరిలో ఉద్ధండులు..
ఇదిలా ఉంటే.. నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ బరిలో మూడు ప్రధాన పార్టీల నుంచి ఉద్ధండులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత, మాజీ ఎంపీ మల్లు రవి టికెట్‌ దక్కించుకోగా, బీజేపీలో చేరిన సిట్టింగ్‌ ఎంపీ పోతుగంటి రాములు తన కొడుకు భరత్‌కు టికెట్‌ ఇప్పించుకోగలిగారు. ఇక బీఎస్పీ స్టేట్‌ చీఫ్‌గా పనిచేసి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.