Bandi Sanjay sang a song
Bandi Sanjay : బండి సంజయ్ ఓ మామూలు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఎవరి అండదండలు లేకుండానే ఎదిగారు.. కరీంనగర్లో గ్రామీణ బ్యాంకులో కో ఆపరేటివ్ సభ్యుడి నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి దాకా తన ప్రస్థానాన్ని విస్తరించుకున్నారు. ఒక దశలో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నారు. కానీ నెలల వ్యవధిలోనే కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి.. పార్టీని తెలంగాణ రాష్ట్రంలో విస్తరించేందుకు తీవ్రంగా కృషి చేశారు. రెండు దఫాలు పాదయాత్ర కూడా చేశారు. అయితే అనూహ్యంగా ఆయనను అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తొలగించింది. ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. ఐటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి చెప్పుకో దగ్గ స్థానాలు సాధించకపోయినప్పటికీ.. సత్తా అయితే చాటింది. పార్లమెంటు ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పోటీగా సీట్లను సాధించింది. ఇక కరీంనగర్లో బండి సంజయ్ రెండవసారి ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. రెండోసారి ఎంపీగా గెలవడంతో ఎన్డీఏ ప్రభుత్వం ఆయనను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమించింది.. ఇక ఇటీవల సైబర్ నేరగాళ్ళ చేతుల్లో చిక్కుకొని.. విదేశాలలో ఇబ్బంది పడుతున్న భారతీయులను బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకొని.. స్వదేశానికి రప్పించారు.
Also Read : ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఓడించడానికి ‘పాకిస్తాన్’ను ‘బండి ’ వాడేసాడా?
పాట పాడారు..
ఇలాంటి విషయాన్నయినా సరే కుండబద్దలు కొట్టేలా చెప్పడంలో బండి సంజయ్ సిద్ధహస్తులు. మొహమాటం లేకుండా మాట్లాడుతుంటారు. ఓ వర్గం వారి సమస్యలను పరిష్కరించడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అందువల్లే యువతలో బండి సంజయ్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది. బండి సంజయ్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే విపరీతమైన అభిమానం. ఆ అభిమానాన్ని బండి సంజయ్ అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు.. అందువల్లే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బండి సంజయ్ ని “బడియా బండి.. బడియా” అంటూ అభినందించారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు బండి సంజయ్ విభిన్నంగా ప్రయత్నించారు. అందులో భాగంగానే ఓ పాట పాడారు. నమో నమో నరేంద్ర మోడీ.. పలుకుతున్నది భారత నాడి” అంటూ బండి సంజయ్ ఆ గీతాన్ని ఆలపించారు.. “ప్రధానిగా మీరే కావాలంటున్నది భారతజాతి” అంటూ బండి సంజయ్ ఆలపించిన తీరు ఆకట్టుకుంటున్నది. బండి సంజయ్ పాడిన పాటను బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటుండగా..ఓ వర్గం వారు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ బండి సంజయ్ పాడిన పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. బండి సంజయ్ కి కూడా కావాల్సింది అదే కాబట్టి.. ఆయన కూడా దీనిని ఆస్వాదిస్తున్నారు.
Also Read : మరో మరో ఢిల్లీకి రేవంత్..
ఏదైతే జరగద్దు అనుకున్నానో అదే జరిగింది…
ఇక ఈ జీవితానికి ఇది చాలు ..జన్మ దన్యం అయిపోయింది..
ఎవడన్నా కోహినూర్ డైమండ్ బ్రిటీష్ వాడు తీసుకపోయిండ్ అన్నది అందులో ఒక ముక్క కరీంనగర్ లో పడ్డది ..
కరీంనగర్ వాళ్ళు చేసుకున్న అదృష్టం .. pic.twitter.com/ojPOCk4uwA
— levanth reddy (@pachakukka) March 13, 2025