Bandi Bhagirath Case: ఫోక్సో కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ.. ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టులో వేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు బండి సంజయ్ కుమారుడి కేసును మరో మలుపు తిప్పాయి .
బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలు వయసు విషయంలో క్లారిటీ లేదని హైకోర్టు స్పష్టత ఇచ్చింది. ఒక్కొక్క సర్టిఫికెట్ లో ఒక్క విధమైన డేటాఫ్ బర్త్ ఉందని భగీరథ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి కోర్టుకు విన్నవించారు. దీనిపై హైకోర్టు స్పందించింది. బాధితురాలి వయసు పై పోలీసులు నిర్ధారణ చేయాలని హైకోర్టు సూచించింది. ఈ కేసు కు సంబంధించి మద్యం తర బెయిల్ విషయంలో శుక్రవారం తీర్పు వెలుపడే అవకాశం ఉంది.
ఇప్పటికే భగీరథ పై కఠిన చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత భగీరథ పై లుక్ అవుట్ నోటీస్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. గులాబీ పార్టీ నేతలు సోషల్ మీడియాలో బండి భగీరథకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ అయితే బండి సంజయ్ ని లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.. దీంతో ఈ కేసు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతోంది.. బండి భగీరథ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కావడంతో రాజకీయంగా తెలంగాణలో కలకలం రేపుతోంది.
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మీద ఫిర్యాదు చేసిన ఆ యువతి కి సంబంధించిన కొన్ని కీలక వీడియోలను సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేశారు. అయితే ఆ యువతి మైనర్ కాదని వారు వాదిస్తున్నారు. పైగా ఆమె మద్యం తాగుతున్నట్టు.. స్నేహితులతో విలాసాలకు పాల్పడుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. బండి భగీరథ మీద హాని ట్రాప్ జరిగిందని.. అందువల్లే అతడిని ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారని బిజెపి నేతలు అంటున్నారు. ఇటీవల హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బండి సంజయ్ కూడా కరీంనగర్ గడ్డమీద కీలక వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని.. తన కొడుకును వేదనకు గురి చేస్తున్నారని.. వారందరి భరతం పడతానని బండి సంజయ్ హెచ్చరించారు.. గురువారం హైకోర్టులో బండి భగీరథకు సంబంధించిన మద్యంతర బెయిల్ విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. శుక్రవారం ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ బాధితురాలి డేట్ అఫ్ బర్త్ విషయంలో క్లారిటీ లేకపోతే అప్పుడు ఈ కేసు మరో మలుపు తీసుకునే అవకాశం ఉంది.