DCP Chaitanya: హైదరాబాద్ నగరంలోని చాదర్ ఘాట్ ఏరియాలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల వ్యవహారం మరో మలుపు తీసుకుంది. దీనికి సంబంధించి సిపి సజ్జ నార్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం పోలీసులు సెల్ఫోన్ చోరీకి ప్రయత్నించిన దొంగలను పట్టుకోవడమే. ఆ దొంగలను పట్టుకుని క్రమంలో వారు పోలీసులపై తిరగబడ్డారు. ఒక దొంగ కత్తితో పొడవడంతో డిసిపి చైతన్య గన్మెన్ కు గాయాలయ్యాయి. దీంతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఆ తర్వాత వెంటనే చైతన్య అప్రమత్తమయ్యారు. తన సర్వీస్ రివాల్వర్ తీసుకొని రెండు రౌండ్లపాటు కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరిగిన క్రమంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఆ వ్యక్తిని వెంటనే పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read: ప్రమాదానికి కారకుడు ఈ బైకర్.. పెట్రోల్ బంకులో ఈ దారుణం.. సీసీ టీవీ వీడియో
డిసిపి చైతన్య సురక్షితంగానే ఉన్నారు. గాయపడిన గన్మెన్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ దొంగలిద్దరూ మామూలు వ్యక్తులు కాదని.. అందులో ఒక వ్యక్తి పేరు ఉమర్ అని అతడు కరడుగట్టిన నేరస్థుడని పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాదు నగర పోలీసుల జాబితాలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉమర్ కూడా ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. అయితే మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని.. అతడు కూడా నేరస్థుడని పోలీసులు చెబుతున్నారు. చాదర్ ఘాటు ప్రాంతంలోని విక్టోరియా గ్రౌండ్లో ఈ కాల్పులు జరగడం సంచలనం కలిగించింది.. సెల్ఫోన్ దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకోడానికి డిసిపి చైతన్య, ఇతర పోలీసులు ప్రయత్నించడంతోనే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. చైతన్య మీద దొంగలు దాడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో చైతన్య తన గన్మెన్ వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ ద్వారా దొంగలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో డీసీపీ చైతన్య గన్మెన్ కింద పడ్డారు. దీంతో గన్మెన్ వద్ద ఉన్న రివాల్వర్ తీసుకొని డిసిపి రెండు రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు దొంగలు ఒకరికి గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని నాంపల్లి ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం ఆ వ్యక్తికి చాతికి, మెడకు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఆ దొంగ పాత నేరస్థుడని.. అతనిపై అనేక కేసులు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అయితే డిసిపి చైతన్య గన్మెన్ గాయపడిన నేపథ్యంలో.. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరో నేరస్థుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. అంతేకాదు అతని మీద ఉన్న కేసులను కూడా తవ్వితీస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాదు నగరంలో ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.. అయితే పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఉమర్, మరికొంతమంది నేరస్తులతో కలిసి ఒక గ్యాంగ్ లాగా ఏర్పడ్డాడని.. నేరాలకు పాల్పడుతున్నాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.