https://oktelugu.com/

నిజామాబాద్ లో దారుణం.. యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారం

చట్టాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న ఆడవాళ్లపై ఆత్యాచారాలు ఆగడం లేదు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నిర్భయ ఘటన తరువాత ఏమైనా మార్పులు చేసుకున్నాయా అంటే ఏమీ లేదు. సంచలనం రేపిన హైదరాబాద్ ఆరేళ్ల చిన్నారి హత్యాచారం, నల్గొండలో మధ్య వయస్కురాలైన వివాహితపై ఇద్దిర సామూహిత అత్యాచారం, హత్య వంటి ఘటనలు మరవకముందే తెలంగాణలో మరో ఘోరం చోటుచేసుకుంది. ఓ యువతిని చెరబట్టిన కామాంధులు ఆమెకు మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 29, 2021 / 10:54 AM IST
    Follow us on

    చట్టాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న ఆడవాళ్లపై ఆత్యాచారాలు ఆగడం లేదు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నిర్భయ ఘటన తరువాత ఏమైనా మార్పులు చేసుకున్నాయా అంటే ఏమీ లేదు. సంచలనం రేపిన హైదరాబాద్ ఆరేళ్ల చిన్నారి హత్యాచారం, నల్గొండలో మధ్య వయస్కురాలైన వివాహితపై ఇద్దిర సామూహిత అత్యాచారం, హత్య వంటి ఘటనలు మరవకముందే తెలంగాణలో మరో ఘోరం చోటుచేసుకుంది.

    ఓ యువతిని చెరబట్టిన కామాంధులు ఆమెకు మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన వెలుగులో వచ్చింది. తాజాగా నిజామాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. నలుగురు యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి గదిలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది డయల్ 100కు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు యువతి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. యువతికి మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు.

    ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే యువతిపై నలుగురు వ్యక్తులు బంధించి మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో షాక్ లోకి వెళ్లిపోయిన యువతి ప్రస్తుతం ఆమె మాట్లాడే పరిస్థితిలో లేదని, తేరుకున్నాక వాంగ్మూలం తీసుకుంటామని పోలీసులు తెలిపారు.