spot_img
Homeక్రైమ్‌Vijaya Reddy case shocking truth: విజయ రెడ్డి కేసులో సంచలన నిజాలు బయటకు రాబోతున్నాయా?

Vijaya Reddy case shocking truth: విజయ రెడ్డి కేసులో సంచలన నిజాలు బయటకు రాబోతున్నాయా?

Vijaya Reddy case shocking truth: ఒక మనిషి బలవంతంగా తన ప్రాణం తీసుకోవాలంటే ఖచ్చితంగా బలమైన కారణాలు ఉండాలి. బలమైన కారణాలు ఉంటేనే ఒక మనిషి చనిపోతాడు. కానీ, హైదరాబాదులోని చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో గూడ్స్ రైలు కిందపడి విజయ రెడ్డి అనే ఐటీ ఉద్యోగి, ఆమె ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

విజయ రెడ్డి ఐటీ ఉద్యోగి. ఓ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తోంది. వేతనం నెలకు లక్షకు పైగానే ఉంటుంది. ఆమె భర్త కూడా ఐటి ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు. పేరుపొందిన సంస్థలో ఉద్యోగం రావడంతో దుబాయ్ వెళ్లిపోయాడు. అతడి వేతనం కూడా భార్య అకౌంటు కు ఎప్పటికప్పుడు బదిలీ చేస్తుంటాడు. ఆర్థికంగా ఈ కుటుంబానికి ఎటువంటి కష్టాలు లేవు. పైగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో వారికి కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి. వాటి ద్వారా ప్రతినెల రెంట్ లు కూడా వస్తుంటాయి.

పిల్లలిద్దరూ కార్పొరేట్ కాలేజీలలో చదువుతున్నారు. అక్కడే హాస్టల్లోనే ఉంటున్నారు. విజయ రెడ్డి తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నది. ఐటి పరిశ్రమలో కాబట్టి.. ఎక్కువగా రాత్రి పూట షిఫ్ట్ లు ఉంటాయి. అందువల్ల ఆమె నైట్ పనిచేస్తుంది.. డే పూట రెస్ట్ తీసుకుంటుంది.

ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు. భర్త నుంచి ఇబ్బందులు కూడా లేవు. బంధువులతో ఆస్తి తగాదాలు లేవు. ఇలాంటి క్రమంలో విజయా రెడ్డి చనిపోవడం.. కూడా ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దుబాయ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత విజయ రెడ్డి భర్తను పోలీసులు విచారించారు. అతడు తమ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని.. తన భార్య అలా ఎందుకు చేసిందో అర్థం కావడం లేదని అతడు వాపోయాడు. విజయ రెడ్డి సోదరులను కూడా పోలీసులు విచారించారు. బయటికి అందుతున్న సమాచారం ప్రకారం విజయరెడ్డి కేసులో బలమైన కారణం ఉందని.. అందువల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారని.. త్వరలోనే వాటిని బయట పెడతారని తెలుస్తోంది.

విజయ రెడ్డి మొబైల్ కు ఐ యాం సారీ మేడం అని ఒక వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. ఆ వ్యక్తి ఎవరనేది ఇంతవరకు తెలియడం లేదు. ఐటీ ఇండస్ట్రీలో ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు తోటి ఉద్యోగుల నుంచి ఇటువంటి సందేశాలు మేనేజర్లకు సహజమేనని తెలుస్తోంది. అతడు వృత్తిపరంగా అలా మెసేజ్ చేశాడా.. లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా.. పిల్లలతో విజయ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటి.. అనే విషయాలు అతి త్వరలో తెలుస్తాయని ప్రచారం జరుగుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular