Homeటాప్ స్టోరీస్Acre measurement AP vs TS: ఏపీలో ఎకరం.. తెలంగాణలో రెండు ఎకరాలకు సమానం.. ఎందుకిలా...

Acre measurement AP vs TS: ఏపీలో ఎకరం.. తెలంగాణలో రెండు ఎకరాలకు సమానం.. ఎందుకిలా రివర్స్‌ అయింది?

Acre measurement AP vs TS: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పట్టణాల్లో భూమల ధరలు పెరిగాయి. ఇక సాగు భూములకు నీటి వసతి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో సాగుఊముల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. ఒకప్పుడు నీటి సౌకర్యం లేక బీడుగా ఉన్న భూములన్నీ రైతుబంధు కారణంగా సాగులోకి వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకపోవడం, అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో భూముల ధరలు పడిపోయాకి. దీంతో అప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో పదెకరాలు కొనొచ్చని నాటి సీఎం కేసీఆర్‌తోపాటు నాటి మంత్రులు కూడా సెటైర్లు వేశారు. ఇప్పుడు హరీశ్‌రావు రేవంత్‌ పాలనపై విమర్శలు చేస్తూ.. తెలంగాణ భూముల ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్‌లో 10 ఎకరాలు వచ్చేవని, ఇప్పుడు పరిస్థితి తారుమారైందని సెటైర్‌ వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో రెండు ఎకరాలు వస్తాయని, రేవంత్‌ రెడ్డి పాలనలో భూముల ధరలు సగానికి పడిపోయాయని ఆరోపించారు.

Also Read: జగన్ పై లిక్కర్ ‘అప్రూవర్’ బాంబ్ రెడీ చేసిన ‘బాబు’

సిద్దిపేట రైతుల ఆవేదన..
సిద్దిపేటలోని గంగాపూర్‌లో రైతులతో మాట్లాడిన హరీశ్, భూములకు కొనుగోలుదారులు లేరని, ఒకప్పుడు రూ.40 లక్షలుగా ఉన్న ఎకరం ధర ఇప్పుడు రూ.20 లక్షలకు పడిపోయిందని చెప్పారు. ఈ వాదన రైతుల ఆర్థిక ఇబ్బందులను సూచిస్తున్నా, ఇది రాష్ట్రవ్యాప్త ధోరణిని ప్రతిబింబిస్తుందా అనేది ప్రశ్న. తెలంగాణలో భూముల ధరలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం 2024లో 22–40% వరకు మార్కెట్‌ వాల్యూ సవరణలు చేసింది. అయితే, హరీశ్‌ వాదనలు రాజకీయ ఎత్తుగడలా ఉన్నాయా, లేక నిజంగా రైతుల సమస్యలను లేవనెత్తాయా అనేది చర్చనీయాంశం.

రేవంత్‌ పాలనపై పంచ్‌లు..
హరీశ్‌ రావు తన విమర్శలను రేవంత్‌రెడ్డి పాలనపై కేంద్రీకరించారు. ‘‘రెండేళ్లలో భూముల ధరలు సగానికి పడిపోయాయి’’ అని ఆరోపిస్తూ, రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం క్షీణించిందని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా బీఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు పాలనలో భూముల ధరలు నిజంగా ఆకాశాన్నంటాయని చెప్పడం అతిశయోక్తిగా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో 2025 ఫిబ్రవరి నుంచి భూమి రిజిస్ట్రేషన్‌ విలువలు సవరించింది.

Also Read: ఈటల – బండి ఎపిసోడ్ పై అధిష్టానం మౌనం.. ఎందుకో..?

హరీశ్‌ వాదనలో నిజమెంత?
హరీశ్‌ రావు వాదనలు రైతుల ఆందోళనలను ప్రతిధ్వనించినప్పటికీ, వీటిని రాజకీయ దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో భూముల ధరలు కొన్ని ప్రాంతాల్లో తగ్గినప్పటికీ, హైదరాబాద్‌ వంటి నగర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ ఇప్పటికీ బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి వంటి ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఇది ఏకరీతిగా ఉందని చెప్పలేం. హరీశ్‌ రావు ఈ విమర్శల ద్వారా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ వివాదం రాజకీయ హీట్‌ను పెంచుతూ, రైతుల సమస్యలను మరింత లోతుగా చర్చించే అవసరాన్ని గుర్తుచేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular