Harshasai : యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాపులర్ అయిన హర్షసాయి.. తనను వేధించాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కేసుల భయంతో హర్షసాయి పరారీలో ఉన్నాడు. ఈయన కోసం పోలీసులు గాలిస్తుండగా తాజాగా మరో యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు ఈ మెయిల్స్ పెట్టి హర్షసాయి వేధించాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే హర్షసాయి ఓ సినిమాలో నటించాడు. ఆ సినిమాకు నిర్మాత ఎవరో తెలుసా?
పేదలకు డబ్బులు పంచుతూ యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన హర్షసాయికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. యూట్యూబ్ లో ఆయన ఛానెల్ కు 14 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఆయనతో కలిసి కొంత మంది పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇంతలోనే ఆయన గురించి వ్యతిరేక వీడియోలు ప్రసారం అయ్యాయి. బెట్టింగ్ యాప్ కు ప్రమోట్ చేస్తూ పలువురి దగ్గర భారీగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. కొందరు యూట్యూబ్ ఛానెళ్లలో హర్షసాయి అక్రమాలు చేస్తున్నారని ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఈ తరుణంలోనే ఓ యువతి హర్షసాయిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపించింది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధా కృష్ణ పై కూడా ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హర్ష సాయి కోసం తన నివాసానికి వెళ్లారు. కానీ అప్పటికే హర్ష సాయి పరారీ అయ్యాడు. దీంతో పోలీసులు అతని కోసం వెతుకుతుండగా.. తాజాగా మరో యువతి కేసు నమోదు చేయడంపై చర్చనీయాంశంగా మారింది. అయితే ఈమె హర్షసాయికి ఎలాంటి సంబంధం ఉందనే విషయంపై చర్చ సాగుతోంది.
హర్ష సాయి విషయంలో మరెంత మంది బయటికి వస్తారోనన్న చర్చ సాగుతోంది. పేదలకు ఉచితంగా డబ్బులు పంచి కొందరి దృష్టిలో దేవుడిగా పేరు తెచ్చుకున్న ఆయన.. అక్రమంగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. ఇదే సమయంలో యువతులను వేధింపులకు గురి చేశారంటూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. అయితే తానేం తప్పు చేయాలేదని హర్షసాయి పేర్కొన్నా.. పోలీసులకు చిక్కుండా పారిపోవడం పై తీవ్ర చర్చ సాగుతోంది.
ఇదిలా ఉండగా హర్షసాయి తో కలిసి ఓ సినిమాను ప్లాన్ చేశారు. బిగ్ బాస్ ఫేం మిత్ర శర్మ నిర్మాణంలో ఈ సినిమాను మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది. అయితే ఇది విడుదలయ్యే లోపే హర్ష సాయిపై పలు ఆరోపణలు మొదలయ్యాయి. అయితే పేదలకు అన్ని డబ్బులు పంచడానికి తనకు ఎక్కడి నుంచి వచ్చిందని కొందరు అడగగా.. కొన్ని యాప్ లకు ప్రచారం చేస్తుందని వాస్తవమేనని హర్షసాయి ఒప్పుకున్నారు. అయితే తాను సంపాదించిన డబ్బు పేదలకు మాత్రమే అందిస్తున్నాని పేర్కొన్నాడు. కానీ ఆయనపై ఇలా అమ్మాయిలు పిర్యాదులు చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ముందు మందు హర్షసాయిపై ఇంకా ఎలాంటి ఆరోపణలు వస్తాయో చూడాలి.