Amruta Pranay : తమ కూతురిపై దారుణానికి పాల్పడిన తర్వాత.. ఆనవాళ్లు దొరకకుండా చేయడానికి అత్యంత హేయమైన పద్ధతులను అవలంబిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో ఆమె దేహాన్ని కరిగించి.. డ్రైనేజీలో పడేస్తుంది. వినడానికి దారుణంగా ఉన్నప్పటికీ సమాజంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా మలయాళంలో ఈ సినిమా రూపొందించారు. ఇక కంచె సినిమాలో హీరోకు, హీరోయిన్ కు మధ్య కులం అనే కంచె ఉంటుంది. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కులం అనే కంచె వారిద్దరిని దూరంగా ఉంచిందని.. చివరికి దానిని తొలగించి వారిద్దరు ఏకమయ్యారనేది సినిమా కథ సారాంశం. కానీ నిజ జీవితంలో అలా జరగదు. అలా జరగడానికి ఆస్కారం కూడా ఉండదు. ఇటీవల కాలంలో నల్గొండలో యువకుడిని దారుణంగా హతమార్చారు. దానికి కారణం అతడు ప్రేమ పెళ్లి చేసుకోవడమే.. తమ కులం అమ్మాయిని వేరే కులానికి చెందిన వ్యక్తి పెళ్లి చేసుకున్నాడని ఆగ్రహిస్తూ.. ఆ అమ్మాయి తరఫున బంధువులు ఆ యువకుడిని అంతమొందించారు. ఇందులో ఆ యువతి నాయనమ్మ కీలకపాత్ర పోషించడం విశేషం. కాటికి కాళ్లు చాపిన వయసులో ఇప్పుడు ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్నది. ప్రణయ్ పై దారుణం జరిగిన ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఈ ఘటన కూడా చోటు చేసుకోవడం విశేషం.
ఏది గొప్పది?
ప్రణయ్ పై జరిగిన దారుణం తర్వాత.. సోమవారం నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు కీలక తీర్పు వెల్లడించిన తర్వాత కని పెంచిన ప్రేమ గొప్పదా? యుక్త వయసులో ఏర్పడిన ప్రేమ గొప్పదా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. పిల్లలపై కన్న తల్లిదండ్రులకు కచ్చితంగా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో ఆప్యాయత, అనురాగం తో పాటు కట్టుబాట్లు కూడా ఉంటాయి. ఇందులో అనివార్యంగా కులం అనేది కూడా కీలకపాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రులు ఆనాదికాలం నుంచి వస్తున్న భావనలు.. ఇతర వ్యవహారాలు తమ పిల్లలపై చూపించే విధంగా చేస్తాయి. అందువల్లే “మన కులం” అనే భావన బలంగా స్థిరపడిపోయి ఉంటుంది. దానికి వ్యతిరేకంగా తమ పిల్లలు ప్రేమ పెళ్లి చేసుకుంటే సహించలేని స్థితికి చేరుకుంటుంది. కొందరైతే ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంటారు. ప్రేమ పెళ్లి చేసుకున్న తమ పిల్లలపై దారుణాలకు పాల్పడేందుకు కూడా వెనుకాడరు. మరికొందరైతే సమాజం, ఇతర కట్టుబాట్లను పరిశీలనలోకి తీసుకొని అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకా కొంతమంది అయితే పిల్లలతో జీవితాంతం మాట్లాడకుండా ఉంటారు. ఇక ఇటీవల కాలంలో పిల్లల ప్రేమ వివాహాలను తల్లిదండ్రులు కాస్తాలో కాస్త ఆమోదిస్తున్నారు.
ఏ పెళ్లిల్లు గొప్పగా ఉన్నాయి?
ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారు గొప్పగా ఉంటున్నారా? అంటే లేదు అనే సమాధానమే వస్తుంది. అలాగని పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు బాగున్నాయా? అంటే.. దానికి కూడా లేదు అనే సమాధానమే వస్తోంది. ఇక్కడ అంతిమంగా అటు పిల్లలు.. ఇటు పెద్దలు చూడాల్సింది ఏంటంటే.. ప్రేమ వ్యవహారాన్ని పిల్లలు తమతో చెప్పుకునే స్వాతంత్రం పెద్దలు ఇవ్వాలి.. పెద్దలు ఆమోదముద్ర వేసిన తర్వాత పెళ్లి చేసుకునే స్వతంత్రాన్ని పిల్లలు ఒంట పట్టించుకోవాలి. అంతే తప్ప ఒకరిని ఒకరు కాదని.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అంతిమంగా అమృత ప్రణయ్ లాంటి ఉదంతాలే జరుగుతుంటాయి. అమృత కుటుంబానికి కోట్ల రూపాయల ఆస్తి ఉంది. అయినా కూడా 2018 నాటికి ముందు పరిస్థితులను వారు ఇకముందు చూడలేరు. మారుతీ రావును కోల్పోయి అమృత తల్లి ఒంటరిగా జీవిస్తోంది. ప్రణయ్ ని కోల్పోయి అమృత కూడా జీవితాన్ని భారంగా వెళ్ళదిస్తోంది. ఇక మారుతీ రావు ఇప్పటికే కాలం చేశాడు. అతడి సోదరుడు యావజ్జీవ కారాగార శిక్షకు గురయ్యాడు. దీని అందరికీ కారణం అమృత అని మారుతీ రావు సోదరుడి కుమార్తె ఆరోపిస్తోంది. ఇలా ఎటుచూసుకున్నా ఆ కుటుంబాలలో అంతులేని విషాదమే కనిపిస్తోంది. అందుకే అంటారు ప్రేమ ఎప్పుడూ విషాదాన్ని కోరుకోదని.. కానీ అమృత ప్రేమ విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగింది. అంతేకాదు అమృత ప్రణయ్ ప్రేమ ఉదంతం సమాజానికి ఎంతో విలువైన పాఠం చెబుతోంది కూడా.