https://oktelugu.com/

Amar Raja Factory : ఏపీ వద్దనుకుంది..తెలంగాణ ఒడిసి పట్టుకుంది

రాజకీయ కారణాలతో జగన్ ప్రభుత్వం వేధించింది. కాలుష్యం పేరుతో తప్పుడు రిపోర్టులు సృష్టించి పరిశ్రమను మూత వేయించి.. తామే వెళ్లిపోవాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చింది. వారు కోరుకుంటున్నట్లుగానే అమరరాజా పక్క రాష్ట్రానికి వెళ్లిపోయింది.

Written By:
  • Dharma
  • , Updated On : May 6, 2023 / 03:59 PM IST
    Follow us on

    Amar Raja Factory : పాలకుల వక్రబుద్ధి ప్రజలకు శాపంగా మారుతుంది. ఇప్పుడు ఏపీ ప్రజలకు అదే పరిస్థితి దాపురించింది, పాలన కంటే రాజకీయ పగ, ప్రతీకారాలతో వ్యవహరిస్తుండడంతో ఏపీకి అంతులేని నష్టం కలుగుతోంది. దాదాపు పది వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కోల్పోయారు. పన్నుల రూపంలో కోట్లాది రూపాయలను ప్రభుత్వం చేజార్చుకుంది. పారిశ్రామికరణలో ఏపీ వెనుకబడిపోయింది. ఈ నష్టమంతా ఏపీ నుంచి అమర్ రాజా పరిశ్రమ వైదలగొడమే. చిత్తూరు జిల్లాలో ఉన్న అమర్ రాజా పరిశ్రమ యాజమాన్యానికి వైసీపీ సర్కారు ఏ స్థాయిలో ఇబ్బందిపెట్టిందో అందరికీ తెలిసిందే. దీంతో పరిశ్రమను నడపలేమంటూ యాజమాన్యం తేల్చేసింది. వైదొలుగుతామని ప్రకటించింది. అటు రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల వారు మీరు వైదలగొడం కాదు.. తామే దండం పెట్టి వెళ్లపోమంటున్నామని సెలవిచ్చారు…

    రూ.9,500 కోట్లతో..
    అయితే సీన్ కట్ చేస్తే తెలంగాణలో తొమ్మిదిన్నర వేల కోట్ల రూపాయలతో ఏర్పాటుచేయనున్న లిథియం అయాన్ బ్యాటరీల తయారీ కంపెనీని శనివారం అమర్ రాజా పరిశ్రమ శంకుస్థాపన చేసింది. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. పరిశ్రమతో ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా చాలా మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అమరరాజా బ్యాటరీ పరిశ్రమ కోసం ఎనిమిది రాష్ట్రాలు పోటీ పడినా తెలంగాణలోనే ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని మంత్రి కల్వకుంట తారకరామారావు సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఓ అరుదైన అవకాశంగా అభివర్ణించారు. వీలైనంత త్వరగా ప్లాంట్ నిర్మాణం పూర్తిచేసి ఉత్పత్తులు ప్రారంభించాలని యాజమాన్యాన్ని కోరారు.

     నాడు కేసీఆర్ చొరవ..
    అమర్ రాజా ఏపీని విడిచిపెట్టిన తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పావులు కదిపారు. పరిశ్రమ యాజమాన్యం గల్లా కుటుంబంతో ఉన్న అనుబంధంతో తెలంగాణలో ఏర్పాటుచేసే విధంగా చర్యలు చేపట్టారు. దివిటిపల్లిలో ఏర్పాటు చేసే పరిశ్రమ పూర్తి కాలుష్య రహితం. జీరో లిక్విడ్ డిశ్చార్జీతో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. కంపెనీ కోసం ఎన్నో జిల్లాలు పోటీ పడ్డాయి. కానీ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ కే అవకాశమిచ్చారు.  తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుపై ఆనందంగా ఉందని గల్లా అరుణకుమారి అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం, ప్రభుత్వ అనుకూల విధానాలు ఉన్నాయని చెప్పారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో తమ కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మళ్లీ సొంత రాష్ట్రానికి వచ్చిన ఫీల్ కలుగుతోందన్నారు.

    పదివేల ఉద్యోగాలు మిస్..
    బ్యాటరీ తయారీ రంగంలో అమర్ రాజా పరిశ్రమ అగ్రగామిగా ఉంది. ఈ కంపెనీకి సుదీర్ఘ చరిత్ర ఉంది.  స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఎక్కడో అమెరికాలో స్థిరపడిన గల్లా రామచంద్రనాయుడు అమర్ రాజా ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు.. యువతకు ఉపాధి కల్పించారు. సొంత ప్రాంత ప్రజల అభివృద్ధికి సహకరించారు. ఇప్పటివరకూ అన్ని ప్రభుత్వాలు పరిశ్రమకు సహకరించాయి.  అయితే రాజకీయ కారణాలతో జగన్ ప్రభుత్వం వేధించింది. కాలుష్యం పేరుతో తప్పుడు రిపోర్టులు సృష్టించి పరిశ్రమను మూత వేయించి.. తామే వెళ్లిపోవాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చింది. వారు కోరుకుంటున్నట్లుగానే అమరరాజా పక్క రాష్ట్రానికి వెళ్లిపోయింది. అయితే పరిశ్రమ వెళ్లిపోవడం వల్ల జగన్ కు నష్టం లేదు. సజ్జలకు అంతకంటే లేదు. కానీ ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మాత్రం అంతులేని నష్టం జరిగింది.