CM Revanth Reddy Ganesh Immersion: మన వ్యవస్థ లో ఉన్న దరిద్రం ఏంటంటే.. కొన్ని పనులు కొంతమంది మాత్రమే చేయాలి. ఆ కొంతమందికి మాత్రమే ఆ హక్కు ఉంటుంది. మిగతావారు ఆ పని చేస్తే విమర్శించడానికి ప్రతి నోరూ లేస్తుంది. ప్రతి చెయ్యి రాయి విసరడానికి సిద్ధమవుతోంది. ఇక మీడియా గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంత మురికి కుమ్మరించాలో.. అంత మురికి కుమ్మరిస్తుంది. ఆ తర్వాత కడుక్కోవడం నీ కర్మ రా బాబూ అంటూ వదిలేస్తుంది.
Also Read: ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఎన్ని ఓట్లు వస్తే వైస్ ప్రెసిడెంట్ అవుతారు?
సరిగ్గా కొన్ని నెలల క్రితం పుష్ప రెండవ భాగం విడుదలైంది. సుదీర్ఘకాలం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమా ముందస్తు షో కు హైదరాబాదులోని సంధ్య థియేటర్ కు ఒక కుటుంబం వెళ్ళింది. విపరీతమైన అభిమానులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో రేవతి అనే ఒక మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రి నుంచి కోల్కున్నప్పటికీ ఇంకా అతడు పూర్తిస్థాయిలో ఆరోగ్యాన్ని సాధించలేకపోయాడు. పుష్ప చిత్రంలో కథానాయకుడు సినిమా థియేటర్ వద్దకు రావడం వల్లే ఈ దారుణం జరిగిందని.. బహిరంగంగా ప్రదర్శన చేయడం వల్లే ఇంతటి ఘోరం జరిగిందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అల్లు అర్జున్ కూడా ఒకరోజు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నిండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే ప్రస్తావించారు. అధికార పార్టీ అల్లు అర్జున్ ను తప్పు పట్టడం.. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం.. ఇలా సాగిపోయింది వ్యవహారం. అప్పట్లో అల్లు అర్జున్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
రేవంత్ చేసింది తప్పు కాదా
బహిరంగంగా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడానికి తప్పుపట్టిన ముఖ్యమంత్రి రేవంత్.. ఇటీవల హైదరాబాదులో ట్యాంక్ బండ్ వద్ద గణేష్ నిమజ్జనం జరుగుతుంటే ఎటువంటి కాన్వాయ్.. ఎస్కార్ట్ లేకుండా వచ్చారు. ఆయన రావడమే ఆలస్యం జనం విపరీతంగా పోగయ్యారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు కూడా ఇబ్బంది పడ్డారు. అధికారులు ట్రాఫిక్ నియంత్రణను పక్కనపెట్టి ముఖ్యమంత్రికి బందోబస్తు చేయాల్సి వచ్చింది. వాస్తవానికి అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా విడుదలప్పుడు ఇలానే వచ్చారు. అప్పుడు ఆయన అలా రావడాన్ని ముఖ్యమంత్రి తప్పు పట్టారు. మరి ఇప్పుడు అదే ముఖ్యమంత్రి గణేష్ నిమజ్జనాన్ని వీక్షించడానికి ట్యాంక్ బండ్ వద్దకు వచ్చారు. పైగా ఆయన రావడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. గణేష్ నిమజ్జనానికి కూడా ఇబ్బంది ఏర్పడింది. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఎలాగైనా రావచ్చా.. ఏమైనా చేయొచ్చా.. ప్రజలు ఇబ్బంది పడుతున్న పర్వాలేదా.. ఇప్పుడు ఇవే ప్రశ్నలను అల్లు అర్జున్ అభిమానులు వేస్తున్నారు. మరి వీటికి ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా..