HomeతెలంగాణLiquor Shops: మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. అరోజు అర్ధరాత్రి వరకు వైన్స్ ఓపెన్‌..!

Liquor Shops: మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. అరోజు అర్ధరాత్రి వరకు వైన్స్ ఓపెన్‌..!

Liquor Shops: మరో నాలుగు రోజల్లో 2024 కాలగర్భంలో కలిసిపోతంది. మంచి చెడుల కలబోత అయిన 2024కు ఘనంగా వీడ్కోలు పలకడంతోపాటు కొత్త సంవత్సరం 2025 ను కొంగొత్తగా స్వాగతించేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌ హాల్స్‌ ఇప్పటికే బుక్‌ అయ్యాయి. కొందరు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. లిమిట్స్‌లో వేడుకలు జరుపుకునేందుకు పోలీసులు కూడా అనుమతి ఇచ్చారు. ఇదే సమయంలో గంజాయి, డ్రగ్స్‌ పార్టీలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు నిఘా పెట్టారు. ఈ తరుణంలో తెలంగాణ సర్కార్‌ మందుబాబులకు శుభవార్త చెప్పింది. డిసెంబర్‌ 31 రోజు రాష్ట్రలో అని‍్న మద్యం షాపులు అర్ధరాత్రి 12 వరకు తెరిచే ఉంటాయని తెలిపింది. దీని ద్వారా ఎంతైనా తాగండి అనే సందేశం ఇచ్చింది.

ఒంటి గంట వరకు వేడుకలు..
ఇక నూతన సంవత్సరం సందర్భంగా వేడుకలను అర్ధరాత్రి ఒంటిగంట వరకు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చింది. మద్యం విక్రయాలు అర్ధరాత్రి 12 గంటల వరకు చేసుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, ఈవెంట్లు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ హోటళ్లలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మవచ్చు. అదే విధంగా అన్ని వైన్‌షాపుల్లో మాత్ర అర్ధరాత్రి 12 గంటల వరకు విక్రయించవచ్చని తెలిపింది. ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే మద్యం అమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసు కోవాలని అధికారులను ఆదేశించింది.

గ్రేటర్‌పై నజర్‌..
న్యూ ఇయర్‌వేడుకల నేపథ్యంలో ప్రభుత్వంతోపాటు పోలీసులు విశ్వనగరం గ్రేటర్‌ హైదరాబాద్‌పై దృష్టి పెట్టారు. కొన్నేల్లుగా డిసెంబర్‌ 31న డ్రగ్స్‌ పార్టీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి అలాంటి అవకాశం లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలువురిపై నిఘా పెట్టింది. ఈ మేరకు ఇటీవల జిల్లాల అధికారులతో జరిగిన సమావేశంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకో వాలని ఎక్సైజ్ సిబ్బందికి సూచించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular