https://oktelugu.com/

అలెర్ట్: మరో 24 గంటలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక

  తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కర్ణాటక మీదుగా ఏర్పడిన అల్పపీడిన ద్రోణి ప్రభావంతో రానున్న 24గంటల్లో దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను అలర్ట్ చేసింది. ఇక నిన్నటి నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, వికారాబాద్, […]

Written By: , Updated On : September 26, 2020 / 12:50 PM IST
rain in telangana

rain in telangana

Follow us on

  rain in telangana

తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. మరో 24 గంటలపాటు అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కర్ణాటక మీదుగా ఏర్పడిన అల్పపీడిన ద్రోణి ప్రభావంతో రానున్న 24గంటల్లో దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను అలర్ట్ చేసింది.

ఇక నిన్నటి నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, వికారాబాద్, ఉమ్మడి కరీంనగర్ తదితర జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యారు. వాగులు.. వంగులు పొంగిపోర్లుతుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Also Read: మరో వివాదంలో ఇరుక్కున సీఎం జగన్?

హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వానలు కురిసింది. దీంతో వాహనాదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. హైదరాబాద్ శివార్లలోని హస్తినపురంలో 9.8, కందికల్ గేట్ 7.2, సరూర్ నగర్లో 6.8, చార్మినార్ 6.8, చాంద్రాయణగుట్ట 6.5, మారేడుపల్లి 6.4, ఎల్బీనగర్ 6.4, తార్నాకలో 5.9సెం.మీ వర్షపాతం నమోదుకాగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హిమాయత్ నగర్, అంబర్ పేట్, ఉప్పల్, మాదాపూర్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, కేపీహఎచ్బీ, లింగంపల్లి, పంజాగుట్ట, అమీర్ఫేట, ఎస్ఆర్ నగర్లో భారీ వర్షం కురిసింది. కొన్ని కాలనీల్లోని ఇళ్లల్లోకి నీళ్లు చేరడంతో రాత్రంతా ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

రంగారెడ్డిలోని నందిగామలో 18.3, కొత్తూరులో 14.3, ఫరుక్ నగర్లో 14.3, షాద్ నగర్లో 13.5, షాబాద్లో 12, హయత్ నగర్లో 9.8, శంషాబాద్లో 9.4సెం.మీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్లోని చిగురుమామిడిలో 17.9, సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంటలో 15.3, వరంగల్ రూరల్ జిల్లాలోని పర్వతగిరిలో 13.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Also Read: వాగు ఉధృతితో నిండు గర్బిణీ అవస్థలు..

సూర్యాపేట జిల్లాలోని నడిగూడెంలో 13.8, సిద్దిపేట జిల్లా వర్గల్ లో 13.4, వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేటలో 13.4సెం.మీల వర్షపాతం అత్యధికంగా నమోదయ్యాయి. వికరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.