HomeతెలంగాణKCR: గులాబీ బాస్‌కు ఏమైంది.. ఏదీ నాటి దూకుడు?

KCR: గులాబీ బాస్‌కు ఏమైంది.. ఏదీ నాటి దూకుడు?

KCR: గులాబీ బాస్‌.. తెలంగాణను పదేళ్లు పాలించిన ముఖ్యమంత్రి.. తన పదునైన మాటలు, వాగ్ధాటి, గుక్కతిప్పకోని ప్రసంగం.. సామెతలు, విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు.. ప్రత్యర్థుల నోటమాట రాని కౌంటర్లు.. ఇవీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాటల్లో ఒకప్పుడు కనిపించే దూకుడు. కేసీఆర్‌ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేవారు. కానీ, ఇప్పుడు ఆ మాటల్లో వాడి, దూకుడు కనిపించడంలేదు. కౌంటర్లు, సామెతలు మచ్చుకు కూడా వేయడం లేదు. ఇటీవలి ప్రసంగం చప్పగా సాగుతోంది. వాస్తవంగా చెప్పాలంటే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రోటీన్‌ ప్రసంగంతోనే కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు బోర్‌ కొట్టించారు. బీఆర్‌స్‌ ఓటమికి ఇది కూడా ఓ కారణమని విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. ఇప్పుడు ప్లామెంటు ఎన్నికల సమయంలోనూ కేసీఆర్‌ ప్రసంగం ఆకట్టుకునేలా సాగడం లేదు. ఇప్పటికే తెలంగాణలో మూడు సభలు పెట్టిన కేసీఆర్, ఏప్రిల్‌ 24న బస్సుయాత్ర చేపట్టారు. మిర్యాలగూడలో నిర్వహించిన రోడ్‌షోలోనూ ఆయన ప్రసంగం చప్పగానే సాగింది.

చప్పగా సాగిన ఇంటర్వ్యూలో
ఇక తాజాగా ఓ టీవీ ఛానెల్‌కు కేసీఆర్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత టీవీ ముందుకు వస్తున్నాడని కేసీఆర్‌ ఇంటర్వ్యూపై పెద్ద హైప్‌ తెచ్చారు. నియోజకవర్గ కేంద్రాల్లో పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేయించారు. దీంతో ఇంటర్వ్యూలో కేసీఆర్‌ శివాలెత్తుతారని బీఆర్‌ఎస్‌ వర్గాలు భావించాయి. ప్రత్యర్థులను చీల్చి చెండాడుతాడని అనుకున్నారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. చప్పగా సాగిన ఇంటర్వ్యూతో కేసీఆర్‌ తేలిపోయారని గులాబీ నేతలే చెబుతున్నారు.

రోడ్‌షో చప్పగా..
ఇక బస్స యాత్రలో భాగంగా కేసీఆర్‌ బుధవారం(ఏప్రిల్‌ 24న) మిర్యాలగూడ రోడ్‌షో నిర్వహించారు. ఇందులో అయినా తన పాత దూకుడు ప్రదర్శిస్తారని అనుకున్నారు. కానీ అక్కడక్కడా కొన్ని పంచ్‌ డైలాగ్స్‌ మినహా ప్రసంగం అంతా చప్పగానే సాగింది. మునుపటి వాగ్ధాటి కేసీఆర్‌ ప్రదర్శించడం లేదని గులాబీ నేతలే చెబుతున్నారు. ఇలా అయితే.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిపీట్‌ అవుతాయని పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version