ACB Busts Hyderabad Scam: ప్రభుత్వ ఉద్యోగం అనేది భరోసా మాత్రమే కాదు బాధ్యత కూడా. ఆ బాధ్యతను ఎంత సమర్థవంతంగా నిర్వర్తిస్తే ప్రజలకు అంత త్వరితగతిన సేవలు అందుతాయి. సేవలు త్వరితగతిన అందినప్పుడు ప్రజల్లో ప్రభుత్వం మీద నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం కాస్త ప్రభుత్వాన్ని సుస్థిరం చేస్తుంది. సుస్థిరమైన ప్రభుత్వం ఉంటే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read: ఆ ఎమ్మెల్యేల మీద వేటు ఖాయం.. ఉప ఎన్నికలు వస్తే రేవంత్ అస్త్రం ఇదే!
ప్రభుత్వ ఉద్యోగం అనేది కాసుల కురిపించే ఏటీఎం అని నేటి కాలంలో చాలామంది ఉద్యోగులు భావిస్తున్నారు. అందువల్లే ఉద్యోగాన్ని ఒక బాధ్యతలాగా కాకుండా దోపిడికి మార్గంగా భావించుకుంటున్నారు. కొందరు ఉద్యోగులతే వసూళ్లకు ఏకంగా వ్యక్తులను నియమించుకుంటున్నారు. తద్వారా కోట్లకు ఎదుగుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ నమోదు చేస్తున్న కేసులను బట్టి.. ప్రభుత్వ ఉద్యోగులు ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు అర్థం చేసుకోవచ్చు. సబ్ కలెక్టర్ నుంచి మొదలు పెడితే పంచాయతీ కార్యదర్శులకు అందరూ దొరికిపోతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాన్ని బాధ్యతలాగా నిర్వర్తించకుండా.. వసూళ్లకు పాల్పడుతున్న ఉద్యోగులను మాత్రమే మనం చూశాం. ఏసీబీ కూడా అటువంటి సిబ్బంది మీద మాత్రమే కేసులు నమోదు చేస్తోంది. ఈ కథనంలో మాత్రం అధికారి అవినీతిని అంతకుమించి అనే స్థాయిలో ప్రదర్శించాడు .. ఏకంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పార్కును అమ్మేశాడు. దీనికోసం కోట్లు లంచంగా పుచ్చుకున్నాడు. ఏసీబీ అధికారుల పరిశీలనలో ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏసీబీ అధికారులకు రిజిస్ట్రార్ ల పై విపరీతంగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తుండగా విస్మయకర వాస్తవాలు తెలుగులోకి వస్తున్నాయి.
Also Read: ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్.. మంత్రి పదవి కోసం రామోజీరావు దగ్గరికి వెళ్లారు… ఆ తర్వాత ఏమైందంటే?
హైదరాబాద్ పరిధిలోని వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అతని స్థానంలో సీనియర్ అసిస్టెంట్ శివశంకర్ బాధ్యతలు స్వీకరించాడు. బాధ్యతలు స్వీకరించిన మూడు రోజులకే అతడు సమీపంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పార్కును ప్రైవేటు వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే స్థానికులు ఫిర్యాదు చేయడంతో రిజిస్ట్రార్ ఐజి శివ శంకర్ మీద వేటు వేశారు.. అంతేకాదు సరూర్నగర్ ప్రాంతంలో ఒక డాక్యుమెంట్ మీద సంతకం చేసినందుకు సబ్ రిజిస్ట్రార్ శ్రీలత ఏకంగా 15 లక్షలు లంచంగా తీసుకున్నారు. దీంతో బాధితుడు పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన న్యాయస్థానం సస్పెండ్ చేసింది..