ABN Radha Krishna: స్మశానం ముందు ముగ్గు.. రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదని వెనకటికి ఓ సినిమాలో డైలాగ్ ఉండేది. అప్పట్లో అది చాలామందికి అర్థం కాలేదు. ఇప్పుడు రాజకీయాలను చూస్తే ఆ డైలాగులో ఉన్న అర్థం అవగతం అవుతుంది.. అధికారం కోసం.. అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు రాజకీయ నాయకులు ఎత్తులు వేస్తుంటారు. ప్రత్యర్థులను చిత్తు చేస్తుంటారు. దీనిని కొంతమంది నాయకులు లౌక్యమని.. కొంతమంది నాయకులు అనుచితమని వ్యాఖ్యానిస్తుంటారు. కాకపోతే ఈ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా.. కనికట్టు లేకుండా మీడియా చెప్పగలగాలి. అలా చెబితేనే మీడియాకు విశ్వసనీయత ఉంటుంది.. దురదృష్టవశాత్తు తెలుగులో మీడియా వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో వాస్తవాలు మరుగున పడిపోయి.. అవాస్తవాలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు వాటిని మాత్రమే నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
Also Read: సోషల్ ఫైట్ లో రేవంత్ స్ట్రాటజీ ఏంటి?
తెలుగు నాట సుప్రసిద్ధ పాత్రికేయులుగా చెప్పుకునే వారిలో వేమూరి రాధాకృష్ణ ఒకరు. ఈయన ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానల్స్ నిర్వహిస్తున్నారు. తన పత్రికలో ప్రతి ఆదివారం కొత్త పలుకు పేరుతో సంపాదకీయాలు రాస్తుంటారు. వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేస్తుంటారు. తాజాగా తెలంగాణలో చోటుచేసుకున్న పార్టీ ఫిరాయింపుల మీద వేమూరి రాధాకృష్ణ తన విశ్లేషణ చేశారు. విశ్లేషణ మొత్తం కూడా నూటికి నూరు శాతం వాస్తవం. కాకపోతే ఇందులో ఆయన చంద్రబాబు ప్రస్తావన తీసుకురాకపోవడం ఆశ్చర్యకరం. ఎందుకంటే 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఫిరాయింపులను ప్రోత్సహించారు. వాస్తవానికి ఆయన ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ వైసీపీ నుంచి కొంత మంది ఎమ్మెల్యేలను టిడిపిలోకి తీసుకున్నారు. అయితే ఆ ఎమ్మెల్యేలు 2019లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఒకరకంగా ఆ తీర్పు గుణపాఠం లాంటిది. తెలంగాణలో కూడా అదే విధంగా జరిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ప్రజలు ఓడించారు.
Also read: ‘స్త్రీ శక్తి’.. మహిళల కొత్త పథకం పై చంద్రబాబు కీలక ప్రకటన!
ఇక తెలంగాణలో ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. వారిపై అనర్హత వేటు విధించాలని భారత రాష్ట్ర సమితి ఏకంగా సుప్రీంకోర్టు, హైకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే బాధ్యతను స్పీకర్ మీద వేసింది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులపై వేమూరి రాధాకృష్ణ తనదైన విశ్లేషణ చేశారు. ఈ విశ్లేషణలో చంద్రబాబు ప్రస్తావనను ఆయన తీసుకురాలేకపోయారు. వైయస్ ఫిరాయింపులకు నాంది పలికారని.. కెసిఆర్ దానిని కొనసాగించారని.. రేవంత్ దానిని అనుసరిస్తున్నారని.. ఫిరాయింపులపై ఏ రాజకీయ పార్టీకి మాట్లాడే అధికారం లేదని చెప్పిన రాధాకృష్ణ.. చంద్రబాబు ప్రస్తావన తీసుకురాకపోవడం విశేషం. చంద్రబాబు హయాంలో జరిగిన పార్టీ ఫిరాయింపులు.. 2019 ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యేలకు దక్కిన పరాజయం.. వాటి విషయాలను రాధాకృష్ణ ప్రస్తావించకపోవడం విశేషం. అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈనాడు పత్రిక పెద్దల సభలో గలాబా అనే శీర్షిక తో ప్రచురించిన కథనాన్ని.. నాడు రామోజీరావు వ్యవహరించిన విధానాన్ని చెప్పిన వేమూరి రాధాకృష్ణ.. 2014లో చంద్రబాబు వ్యవహరించిన విధానాన్ని.. ప్రోత్సహించిన పార్టీ ఫిరాయింపులు ప్రస్తావించకపోవడం విశేషం. ఇలాంటప్పుడే మీడియా విశ్వసనీయత మీద ఏవగింపు కలుగుతుంది.