Revanth Reddy Social Media Strategy: అతి ఎప్పుడూ అనర్థదాయకమే. సోషల్ మీడియాకు ఇది వర్తిస్తుంది. కొంతకాలంగా ప్రధాన మీడియా నిశ్శబ్దంగా చూస్తున్న వేళ.. సామాజిక మాధ్యమం రెచ్చి పోతోంది. రకరకాల మార్గాలలో సరికొత్తగా కనిపిస్తోంది.. సోషల్ మీడియా ద్వారా కొత్తగా పాత్రికేయులు పుట్టుకొస్తున్నారు. మైక్ పట్టుకోవడం.. అడ్డగోలుగా ప్రశ్నలు వేయడం.. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం.. ఎవరైనా ప్రశ్నిస్తే ఇదే జర్నలిజం అని చెప్పడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది.
Also Read: : ‘జర్నలిస్టు’కు డెఫినేషన్ ఇచ్చిన సీఎం రేవంత్
కొందరు స్వయం ప్రకటిత జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని.. అడ్డగోలుగా వ్యాఖ్యలు చేస్తూ.. ఇష్టానుసారంగా విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.. మాట్లాడే భాష కూడా సరిగా ఉండడం లేదు. దీనికి తోడు బూతులు.. ఇవన్నీ కూడా పాత్రికేయమంటేనే ఏవగింపు కలిగిస్తున్నాయి. పైగా కొన్ని రాజకీయ పార్టీలు ఈ తరహా జర్నలిజాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇలాంటి వారి వల్ల నిజమైన పాత్రికేయులు ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా సభలు, సమావేశాలలో ఇలాంటి వారు ముందు వరుసలో ఉండడం వల్ల.. మిగతావారు ఇబ్బంది పడుతున్నారు. సరిగ్గా ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ గుర్తించారు. ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఇటువంటి వ్యక్తులను మీరే బహిష్కరించాలని.. సాధ్యమైనంతవరకు దూరంగా ఉండాలని పాత్రికేయులకు రేవంత్ పిలుపునిచ్చారు.
Also Read: సీఎం రేవంత్ కే ఎసరు పెట్టిన పంచాయితీ కార్యదర్శి?
వాస్తవానికి మీడియా అనేది నేడు ఒక అమ్మకపు సరుకు లాగా మారిపోయింది.. వర్గానికి, వర్ణానికి, వ్యక్తులకు డప్పు కొట్టే వ్యవస్థ లాగా మారిపోయింది. ప్రధాన మీడియా కూడా ఇలానే మారిపోయింది. మీడియాను నడిపే వ్యక్తులకు రాజకీయ వాసనలు ఉండడంతో.. వివిధ మాధ్యమాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. పైగా కొన్ని మీడియా సంస్థలు నేరుగా రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్నాయి.. మీడియాను నడిపే వ్యక్తులు కూడా అదే స్థాయిలో మాట్లాడుతున్నారు. రాజకీయంగా ప్రకటనలు చేస్తున్నారు. అలాంటప్పుడు వారిని చూసి కొంతమంది తమకున్న కొద్దిపాటి వనరులతో యూట్యూబ్ ఛానల్స్ మొదలు పెడుతున్నారు. అంతేకాదు వాటి ద్వారా బెదిరింపు పాత్రికేయానికి పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్నారు. అటువంటివారిని నిలవరించడం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియా బలంగా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే స్వయం ప్రకటిత గొట్టాల జర్నలిజం ఫేమస్ అయిపోయింది. రేవంత్ తన అగ్రహాన్ని వ్యక్తం చేసి ఉండవచ్చు. తన ఉక్రోశాన్ని బయటపెట్టి ఉండవచ్చు. అంతిమంగా మాత్రం ఇలాంటి వారిని అదుపు చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్లు అలా పాతుకుపోయారు కాబట్టి.