Duvvada Srinivas Vs Janasena: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై కేసు నమోదయింది. ఓ జనసేన నేత ఫిర్యాదు మేరకు పోలీసులు యేసు నమోదు చేసి దువ్వాడకు నోటీసులు ఇచ్చారు. దీంతో దువ్వాడ శ్రీనివాసును అరెస్టు చేస్తారని ప్రచారం ప్రారంభం అయ్యింది. కొద్దిరోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు దువ్వాడ శ్రీనివాస్. వ్యక్తిగత ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తున్నారని చెబుతూ ఆయనపై వేటు వేసింది వైసిపి హై కమాండ్. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఏ రాజకీయ పార్టీలో లేరు. తన ప్రియ సఖి, సన్నిహితురాలు మాధురితో కలిసి వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టారు దువ్వాడ శ్రీనివాస్. వ్యాపారం కోసం ప్రమోట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు ఆ జంట. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై జనసేన నేత ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు అయ్యింది.
పవన్ పై అనుచిత వ్యాఖ్యలు..
2024 ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ). దారుణంగా ఓడిపోయారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బలమైన వాయిస్ వినిపించారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడానికి వెనుకడుగు వేసేవారు కాదు. ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారని.. తీరా అధికారంలోకి వచ్చాక ప్రశ్నించడం మానేశారని.. అందుకుగాను చంద్రబాబు నుంచి నెలకు 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. అయితే దువ్వాడ శ్రీనివాస్ వైసిపికి దూరం కావడంతో ఆ అంశం మరుగున పడిపోయింది. ప్రస్తుతం వస్త్ర వ్యాపారంలో ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇటీవల ఆయన వాయిస్ కూడా మారింది. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు. లోకేష్ ను సైతం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇటువంటి తరుణంలో జనసేన నేత ఒకరు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జనసేన నేత ఫిర్యాదు పై..
దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా( Srikakulam district) హిరమండలానికి చెందిన జనసేన నేత ఒకరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో కేసు నమోదు చేశారు హిరమండలం పోలీసులు. టెక్కలి వెళ్లి దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చారు. ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. పైగా ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పెద్దల విషయంలో సానుకూలంగా మాట్లాడుతున్నారు. అందుకే ఆయన అరెస్టు ఉండదని కూడా తెలుస్తోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని.. జిల్లాలో ఉన్న తన ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తానంటూ దువ్వాడ శ్రీనివాస్ ఇటీవల హెచ్చరించారు. అయితే ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ కు ఏ రాజకీయ పార్టీ మద్దతు లేదు. అయితే దువ్వాడ శ్రీనివాస్ అరెస్టు ఉండదని కూడా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.