Viral News: అన్ని ఉద్యోగాల కల్లా పోలీసు ఉద్యోగం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాల వారు తమ సమస్యలను పరిష్కరించమని కోరేది పోలీసులనే. వారికేదైనా సమస్య ఎదురైతే ముందుగా తొక్కేది పోలీస్ స్టేషన్ గడపే. అయితే అటువంటి పోలీసు శాఖకు కొంతమంది అధికారులు మచ్చ తెస్తున్నారు. సమస్య మీద తమను కలిసిన వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి ఏఎస్ఐ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన 23 సంవత్సరాల ఓ యువతి భర్త తాగుడుకు బానిస అయ్యాడు. ప్రతిరోజు రాత్రి మద్యం తాగి వచ్చి ఆమెను కొడుతున్నాడు. పెద్ద మనుషులు సర్ది చెప్పినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. విసిగి వేసారి పోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త పెడుతున్న బాధలను ఫిర్యాదు రూపంలో పోలీసులకు అందజేసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఏఎస్ఐ రాములు.. ఆ యువతి భర్తను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ ఆ యువతి భర్త మారలేదు. పైగా మరింతగా ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో ఆ యువతి మళ్లీ పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. ఇలా పలుమార్లు రావడంతో.. ఈఎస్ఐ ఆమెపై కన్నేశాడు. విచారణ పేరుతో ఆమెను ముగ్గులోకి దింపాడు. తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడేవాడు. ఇలా ఆమెకు దగ్గరయ్యాడు. అయితే ఈ విషయం ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన మెట్ పల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ సీఐ ఏఎస్ఐని మందలించారు. ఉన్నతాధికారులకు చెప్పకండని, త్వరలో తనకు పదవి విరమణ ఉందని చెప్పి బతిమిలాడారు. తన వ్యవహార శైలి మార్చుకుంటారని సీఐ కాళ్లు మొక్కినట్టు తెలుస్తోంది.
అయితే ఆ ఏఎస్ఐ ఆ యువతితో అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మెట్ పల్లి లోని వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫోటోలు హల్ చల్ సృష్టించాయి. దీంతో పోలీసులు ఆ ఏఎస్ ఐ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కాగా, ఆ ఏఎస్ఐ పై గతంలోనూ ఈ తరహా ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తోంది. విచారణ పేరుతో ఆ యువతిని ముగ్గులోకి దించి.. అన్ని రకాలుగా దగ్గరయ్యాడని తెలుస్తోంది. తరుచూ ఆమె ఇంటికి వెళ్లడం.. తన వాహనంలో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం.. వంటివి చేస్తుండేవాడని.. అలా చేయడం వల్లే ఆయన రాసలీల వ్యవహారం ఎస్సై దృష్టికి వెళ్లిందని అక్కడి పోలీస్ స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు. కాగా ఏఎస్ఐ వయసు 53 సంవత్సరాలు.. అతడికి 23 సంవత్సరాల నుంచి వయసు ఉన్న పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ఏఎస్ఐ వ్యవహార శైలి పట్ల స్థానికులు మండిపడుతున్నారు. రిటర్మెంట్ కు దగ్గరగా ఉన్న సమయంలో ఇదేం పాడు పనంటూ దుమ్మెత్తి పోస్తున్నారు.