Hyderabab Women Obese: హైదరాబాద్ లేడీలు తెగ ‘లావై’ పోతున్నారు.! అవును ఇది ఎవరో చెప్పింది కాదు.. అక్షరాల తెలంగాణ ప్రభుత్వమే నిగ్గుతేల్చింది. తెలంగాణకు సంబంధించి డేటా బేస్ ను బలోపేతం చేసేందుకు ప్రణాళిక శాఖ ఓ నివేదికను ప్రచురించింది. ఈ నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ లో 51 శాతం మంది మహిళలు స్థూలకాయులేనని ప్రభుత్వ రిపోర్టులో వెల్లడైంది. హైదరాబాద్ మహిళలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది.

కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ 2019-20కి విడుదల చేసిన నివేదిక ప్రకారం ఒక్కో మహిళ బాడీ మాస్ ఇండెక్స్ లో ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉన్నట్టుగా తేల్చారు. మొత్తంగా 51 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే తెలంగాణ మొత్తంగా చూస్తే ఈ సమస్య కేవలం 30.1 శాతం మాత్రమే. అంటే హైదరాబాద్ లో ఉంటున్న మహిళలు మాత్రమే ఎక్కువ బరువు సమస్య బారినపడుతున్నట్టు తేలింది.
తెలంగాణలో అత్యల్పంగా అడవుల జిల్లా ‘కుమరంభీం’ జిల్లాలో 14శాతం మంది మాత్రమే మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు. బీఎంఐలో అధిక బరువు 25 సరాసరి కేజీలుగా గుర్తించారు. తెలంగాణ మొత్తం 30.1 శాతంగా ఉంది. తెలంగాణలో 18.8 శాతం మంది మహిళలు వారి బీఎంఐ లెవల్స్ ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉన్నారని తేలింది.
కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ మహిళలు తెలంగాణ మొత్తం సగటుతో పోలిస్తే ఎంతో విద్యాధికులు.. హైదరాబాద్ లో ఉన్న మహిళల్లో 83.6 శాతం మంది అక్షరాస్యత కలిగిన వారే. తెలంగాణ మొత్తం ఈ శాతం 66.6 శాతం మాత్రమే. తెలంగాణలో నమోదవుతున్న జననాల్లో 60 శాతం సిజేరియన్ వే కావడం గమనార్హం. కరీంనగర్ లో అయితే ఏకంగా 82 శఆతం జననాలు సిజేరియన్ ద్వారా జరుగుతున్నాయి. ఈ సిజేరియన్ ఆపరేషన్ల వల్ల కూడా మహిళలు బరువు పెరుగుతున్నారని తేలింది.