Nalgonda: తవ్వకాల్లో బయటపడ్డ పురాతన కుండలు.. ఓపెన్ చేసి చూస్తే షాక్!

నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఫణిగిరిలో బౌద్ధుల కాలంలో వినియోగించినవిగా భావిస్తున్న 3,700 సీసపు నాణేలను పురావస్తు శాఖ వెలికి తీసింది.

Written By: Raj Shekar, Updated On : April 2, 2024 3:08 pm

Nalgonda

Follow us on

Nalgonda: పురాతన చరిత్ర, సాంస్కృతిక ఆధారాలు తెలుసుకునేందుకు, పూర్వీకుల ఆచార సంప్రదాయాలు తెలుసుకునేందుకు పురావస్తు శాఖ తవ్వకాలు జరుపుతుంది. తాజాగా ఈ శాఖ నల్గొండ జిల్లాలో జరిపిన తవ్వకాల్లో 2 వేల ఏళ్ల నాటి నాణేలు బయటపడ్డాయి.

తిరుమలగిరిలో..
నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఫణిగిరిలో బౌద్ధుల కాలంలో వినియోగించినవిగా భావిస్తున్న 3,700 సీసపు నాణేలను పురావస్తు శాఖ వెలికి తీసింది. 2015లో ఫణిగిరి గ్రామంలో జరిపిన తవ్వకాల్లో కూడా 2 వేల ఏళ్ల నాటి బౌద్ధ్ద అవశేషాలను పురావస్త శాఖ సేకరించింది. ఫణిగిరి క్రీ.పూ. 3వ శతాబ్దం , క్రీ.శ. 3వ శతాబ్ధం మధ్య కాలంలో బౌద్ధ జానానికి సంబంధించిన ప్రధాన ప్రాంతంగా వర్ధిల్లినట్లు చెబుతున్నారు. అక్కడి కొండపై 16 ఎకరాల విస్తీర్ణంలో బౌద్ధ స్తూపం, చైత్యాలు ఉన్నాయి.

ప్రతీది ఖళాఖండమే..
తెలంగాణలో వివిధ పురావస్తు స్థలల్లో జరిపిన తవ్వకాల్లో ఎక్కువగా ఇక్ష్వాకుల నాటి శిల్పాలు దొరికాయట. ఇలా దొరికిన ప్రతీ రాతి ముక్క ఒక కళాఖండమే అని చెబుతారు. దక్షిణ భారత దేశంలో బోధి సత్వుడి నిలువెత్తు స్టక్కో విగ్రహం కేవలం ఫణిగిరి తవ్వకాల్లో దొరికిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

1941లో తవ్వకాలు..
స్వాతంత్య్రానికి పూర్వం 1941లో అప్పటి నిజాం సర్కార్‌ కూడా ఫణిగిరిలో తొలుత తవ్వకాలు జరిపింది. ఆ సమయంలో బౌద్ధ ఆధారాలు కనుగొన్నారు. 2001–2007 మధ్య, తిరిగి 2018–19 మధ్య ఇక్కడ జరిపిన తవ్వకాల్లో అనేక అవశేషాలు గుర్తించారు. 2024, మార్చి 31న జరిపిన తవ్వకాల్లో నాణేలు, తోరణాలు, శాసనాలు, వ్యాసాలు, లిఖిత పూర్వక స్తంభాలు కనుగొన్నారు.