https://oktelugu.com/

Hyderabad : నిర్లక్ష్యానికి ప్రాణం బలి : కారు డోరు.. ఆ పసిపాపను చిదిమేసింది

ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు కిందపడిపోగా.. 2 ఏళ్ల పాప అక్కడిక్కడే మృతి చెందింది. సయ్యద్, శశిరేఖ దంపతులకు గాయాలయ్యాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.

Written By:
  • NARESH
  • , Updated On : June 2, 2023 / 09:13 PM IST
    Follow us on

    Hyderabad : ఓ చిన్న నిర్లక్ష్యం ఓ పసిపాప ప్రాణాలు తీసింది. ఓ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. రోడ్డుపై నిర్లక్ష్యంగా వెళితే ప్రవర్తిస్తే ఎంతటి దారుణాలు జరుగుతాయో ఈ ఘటన కళ్లకు కట్టింది.

    హైదరాబాద్‌ లో ఎల్బీ నగర్‌ లో దారుణం జరిగింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి ఓ 2 ఏళ్ల పాప ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రోడ్డు పక్కన కారు ఆపిన డ్రైవర్ సడెన్‌గా డోర్ తీయటంతో బైక్ పై వెనుకాల వస్తున్న ఓ కుటుంబం కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో వారి 2 ఏళ్ల పాప అక్కడికక్కడే మృతి చెందింది.

    సయ్యద్-శశిరేఖ దంపతులకు 2 ఏళ్ల ధనలక్ష్మి పాప ఉంది. ఈ ముగ్గురు బైక్ పై వస్తున్నారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి సమీపంలోకి రాగానే.. ఓ వ్యక్తి రోడ్డు పక్కన కారు ఆపాడు. ఆపై వెనుక నుంచి ఎవరు వస్తున్నారో చూసుకోకుండా సడెన్‌గా కారు డోర్ తీశాడు. అంతే.. వెనుక నుంచి బైక్ వస్తున్న సయ్యద్ బైక్‌కు కారు డోరు తగిలింది.

    ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు కిందపడిపోగా.. 2 ఏళ్ల పాప అక్కడిక్కడే మృతి చెందింది. సయ్యద్, శశిరేఖ దంపతులకు గాయాలయ్యాయి. చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలవిసేలా రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.

    ఘటన తర్వాత ఆ కారు డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.