
ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి సోమవారం బీజేపీలో చేరుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ మేయర్ పదవి ఇస్తే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. హైద్రాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలన్న బీజేపీ వాదాన్ని ప్రజలు సమర్థించారన్నారు. రెండు మూడు రోజుల్లో బీజేపీ కార్పొరేటర్లతో కలసి భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్తామని వెల్లడించారు. 2023లో అధికారంలోకి రావటమే తమ లక్ష్యమన్నారు. ఎన్నికలు హడావుడిగా నిర్వహించకపోతే.. బీజేపీ వందకు పైగా స్థానాల్లో గెలిచేదని చెప్పారు. ” బీజేపీని తక్కువ అంచనా వేసిన ముఖ్యమంత్రికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు.