
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా అధికార టీఆర్ఎస్ మూడో జాబితా శుక్రవారం విడుదల చేసింది. ఇప్పటికే 125 మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ తాజాగా మరో 25 మంది పేర్లను తెలిపింది. దీంతో మొత్తంగా 150 డివిజన్లలో టీఆర్ఎస్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే నామినేషన్లకు శుక్రవారం చివరిరోజు కావడంతో పేర్లు ఖరారైన అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు వెళ్తున్నారు.

