
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిశారు. దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు వారంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు రూ.3,016ల పెన్షన్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు.