
న్యూ ఇయర్ వేడుకల్లో మరో విషాద చోటుచేసుకుంది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన ఈరోజు తెల్లవారుజామున వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వర్ధన్నపేట పట్టణ శివారు నీలగిరిస్వామి తండాలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొని ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. వర్ధన్నపేటలో స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరై ద్విచక్ర వాహనంపై ముగ్గురు స్నేహితులు రాయపర్తికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఐత శ్రీకాంత్(20), శ్రీశాంత్(18) అక్కడికక్కడే మృతిచెందగా.. రేవంత్ అనే బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.