
అనారోగ్య కారణంగా తాను రాజకీయాల్లోకి రాలేనంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయాన్ని ఆయన అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేపోతున్నారు. రజనీకాంత్ దిష్టిబొమ్మలు తగలబెట్టడం, ఆయన ఇంటి ముందు నిరసనలు, ర్యాలీలు చేయడం వంటివి చేస్తున్నారు. తాజాగా మురుకేసన్ అనే వ్యక్తి రజనీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తనకు తాను నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మురుకేసన్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. కాగా, రజనీకాంత్ తన నిర్ణయం ప్రకటించినప్పటి నుండి తమిళనాట భారీ ఆందోళనలు జరుగుతున్నాయి.