
దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి అన్ని రంగాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి.ముఖ్యంగా సినిమా థియేటర్లు అన్నింటి కంటే ముందుగానే మూతపడ్డాయి. అయితే అన్ లాక్ గైడ్ లైన్స్ లో భాగంగా దేశంలోని పలు థియేటర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తెలంగాణలో రెండు రోజుల కిందట సీఎం అనుమతి ఇవ్వడంతో సినిమా థియేర్లలో బొమ్మ పడింది. కానీ హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లు శాశ్వతంగామూత పడనున్నాయి. నగరంలోని నారాయణగూడలో ఉన్న శాంతి, ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని శ్రీ మయూరి, మోహిదీపట్నంలోని అంబ థియేటర్లు పూర్తిగా మూసివేస్తున్నారట. వాటిని వ్యాపారాల నిమిత్తం గోడౌన్లుగా మారుస్తున్నారట. కాగా ఇప్పటికే ప్రారంభమైన సినిమా థియేటర్లు కనుక మళ్లీ నష్టాలకు గురైతే వాటి పరిస్థతి కూడా ఇలాగే ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు.