Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్రాజ్ భవన్ లో జనవరి 1న జరిగే ఓపెన్ హౌస్ రద్దు

రాజ్ భవన్ లో జనవరి 1న జరిగే ఓపెన్ హౌస్ రద్దు

కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా రాజ్ భవన్ లో ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన ఆనవాయితీగా నిర్వహించే ఓపెన్ హౌస్ ఈ సంవత్సరం రద్దు అయింది. కోవిడ్-19 నివారణ నిబంధనలు పాటిస్తూ, ఈ ఓపెన్ హౌస్ ఈ సంవత్సరం రాజ్ భవన్ లో నిర్వహించడం లేదు. గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఈ కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ రోజు ఉదయం 10 గంటల నుండి 11 గంటల మద్య ఒక గంటపాటు ఫోన్-ఇన్ ద్వారా ప్రజల నుండి శుభాకాంక్షలు స్వీకరిస్తారు. గవర్నర్ కు శుభాకాంక్షలు తెలియజేయాలనుకునేవారు 040-23310521 నంబర్ కు ఉదయం 10 గంటల నుండి 11 గంటల మద్య ఫోన్ చేయవచ్చు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular