
జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక తొలి ఏడాది(2019-20) రాష్ట్ర రాబడులు, ఆర్థిక పరిస్థితి బాగావున్నా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. యనమల మీడియాతో మాట్లాడారు. ‘అన్నీవున్నా తన చేతగానితనంతో ఏమీ చేయలేక పోయారు. నాన్ ఫెర్ఫార్మెన్స్ సీఎంగా జగన్ రెడ్డి మిగిలారు. కరోనా సాకుతో తమ చేతగానితనంతో కప్పి పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ రెండేళ్లలో అటు జగన్ రెడ్డి చేతగానితనం, ఇటు కరోనా రెండూ రాష్ట్రంపై దుష్ఫలితాలు చూపాయి. ఈ రెండింటి వల్ల నష్టపోయింది ప్రజలే. రాబోయే మూడో ఏడాది కూడా ఈ రెండింటి దుష్ఫలితాలే ఎదుర్కోవాలి అన్నారు.