ఉన్నట్టుండి.. ఏపీలో ఈ ఎర్రచందనం రాజకీయం ఏంది..?

ఏపీలోని తిరుపతి, శేషాచలం కొండల్లో ఎర్రచందనం అడవులు ఉన్నాయి. రాజకీయ నేతలే ఎర్రచందనం స్మగ్లర్లు అని ప్రచారంలోనూ ఉంది. కానీ ఎవరూ చిక్కరు. తమిళ కూలీలను పెద్ద ఎత్తున తీసుకొచ్చి అడవుల్ని కొట్టేసి ఎర్రచందనాన్ని విదేశాలకు రవాణా చేస్తుంటారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. అక్కడ స్మగ్లర్లు పట్టుబడని రోజంటూ లేదు. ఎంత కఠిన చర్యలు తీసుకున్నా.. స్మగ్లర్లు వెనక్కి తగ్గకపోవడంతో ఓ సారి ఎన్ కౌంటర్ కూడా చేశారు. […]

Written By: NARESH, Updated On : October 15, 2020 12:32 pm
Follow us on

ఏపీలోని తిరుపతి, శేషాచలం కొండల్లో ఎర్రచందనం అడవులు ఉన్నాయి. రాజకీయ నేతలే ఎర్రచందనం స్మగ్లర్లు అని ప్రచారంలోనూ ఉంది. కానీ ఎవరూ చిక్కరు. తమిళ కూలీలను పెద్ద ఎత్తున తీసుకొచ్చి అడవుల్ని కొట్టేసి ఎర్రచందనాన్ని విదేశాలకు రవాణా చేస్తుంటారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. అక్కడ స్మగ్లర్లు పట్టుబడని రోజంటూ లేదు. ఎంత కఠిన చర్యలు తీసుకున్నా.. స్మగ్లర్లు వెనక్కి తగ్గకపోవడంతో ఓ సారి ఎన్ కౌంటర్ కూడా చేశారు. చెన్నై, కోల్‌కతా లాంటి చోట్ల నిల్వ చేసిన ఎర్రచందనం దుంగల్ని కూడా పట్టుకొచ్చారు. కేంద్రం అనుమతితో రెండుసార్లు వేలం వేసి రూ.రెండు వేల కోట్ల ఆదాయం కూడా పొందారు.

Also Read: సీఎం జగన్ ఏరికోరి మరీ పెట్టుకుంటున్నాడా?

అయితే.. ఉన్నట్టుండి ఇప్పుడు ఏపీ బీజేపీ ఎర్రచందనం అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఏకంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డిని ఢిల్లీ వెళ్లి మరీ కలిశారు. ఏపీలో పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని, ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదని, కేంద్రం జోక్యం చేసుకుని ఎర్రచందనాన్ని రక్షించాలని కోరారు. దీనిపై కిషన్ రెడ్డి స్పందించారు. ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాస్తామని హామీ ఇచ్చారు.

ఏపీలో జగన్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. స్మగ్లర్లను కూడా ఇంతవరకు పట్టుకోలేదు. గత ప్రభుత్వం కన్నా మించి చర్యలు తీసుకున్నది లేదు. రాజకీయ నేతలే ఎర్రచందనం తరలించేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తుండడంతో అందుకే ప్రభుత్వం సైలైంట్‌ అయిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం కూడా గోడౌన్ల నుంచి మాయమైందని కూడా తెలుస్తోంది. ఇలాంటి సందర్భంలో బీజేపీ నేతలు ఎర్రచందనం విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ఆసక్తి రేపుతోంది.

Also Read: కేసీఆర్ సార్.. క‘న్నీళ్ల’ వేళ కనిపించవా?

అయితే ఏపీ బీజేపీ నేతుల హఠాత్తుగా ఎర్రచందనం అంశాన్ని ఎందుకు పైకి తెస్తున్నారనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు హిందూ దేవాలయాలపై దాడులు నిరసిస్తూ ఆందోళనలకు దిగిన బీజేపీ.. ఇప్పుడు ఈ ఎర్రచందనంపై ఏకంగా కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడం వెనుక ఏమై ఉంటుందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.