
తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దయచేసి నన్ను కలవడానికి ప్రయత్నించకండి.. కనీసం ఫోన్ కూడా చేయవద్దు. నాతో పాటు కార్యక్రమాల్లో పాల్గొన్నవారు అవసరమైతే పరీక్షలు చేయించుకోండి.. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అందుకే ఇంట్లోనే ఉంటున్నానును. కోవిడ్ తగ్గిన తరువాత యధావిధిగా కార్యక్రమాల్లో పాల్గొంటాను ’ అని పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. కాగా ఇప్పటి వరకు తెలంగాణ మంత్రుల్లో హరీశ్ రావు, పద్మారావు ఇతర ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ కి పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన నెలకొంది.
#RTPCR పరీక్షల్లో నాకు #COVID పాజిటివ్ అని తేలింది.దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నాతో కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలని మనవి. హోం ఐసోలాషన్ లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను.
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) December 15, 2020