
కలప అక్రమ రవాణాకు సహకరించిన ముగ్గురు అటవీశాఖ అధికారులను కాగజ్‌నగర్ అటవీడివిజన్ అధికారి విజయ్‌కుమార్ సస్పెండ్ చేశారు. కుమరం భీం జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద ఎఫ్‌ఎస్‌ఓగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్, గూడెం ఎఫ్‌బీవో రామయ్య, శివపెల్లి ఎఫ్‌బీవో సద్దాంలు గూడెం బ్రిడ్జి వద్ద విధులు నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో మహారాష్ట్రకు చెందిన కొందరు కలపను తెలంగాణకు సరఫరా చేయడంలో ఈ ముగ్గురు అధికారులు సహకరించారని వియ్‌కుమార్ తెలిపారు. ఇదే విషయంపై మహారాష్ట్ర అధికారులు విచారణ చేపట్టగా వీరి పేర్లు బయటకొచ్చాయి.దీంతో ముగ్గురిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా అక్రమంగా రవాణా అయిన కలప రూ. 60 లక్షలకు పైగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.