
ఆంధ్రప్రదేశ్‌లో వర్షబీభత్సం కారణంగా పలు ప్రాంతాలు నీ మునిగాయని, వరదలో చిక్కుకున్న వారిని కాపాడాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను అంచనా వేసి కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోళ్లు జరపాలన్నారు. నష్టపోయిన కౌలు రైతును గుర్తించి వారిని ఆదుకోవాలన్నారు. ఉపాధి కోల్పోయిన చేనేత, చేతి వృత్తుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని సూచించారు. వరద కారణంగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.