
హైదరాబాద్ లో బీజేపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన నివాస్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను చూసి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఎనివాస్ కు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడంతో ఆయనను యశోద ఆసుపత్రికి తరలించారు. దుబ్బాక ప్రచారంలో ఉన్న బండి సంజయ్ కార్యకర్త ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకొన్నాడన్న విషయం తెలవగా ఆయన హూటాహుటిన హైదరాబాద్ కు బయలు దేరాడు.