
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత తన భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ అనే వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. 2015 ఎప్రిల్ 7న ఆలేరులో జరిగిన వికారుద్దీన్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో దీనిని నిర్మిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ ను హైదరాబాద్ కు చెందిన మజ్లిస్ బచావో తెహ్రీక్(ఎంబీటీ) తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వికారుద్దీన్ ఎన్ కౌంటర్ లో మరణించిన వారందరినీ దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా వెబ్ సిరీస్ కోసం నిందితుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్పారు. ఇందులో పోలీసులను హీరోలుగా, నిందితులను దోషులుగా చిత్రీకరిస్తున్నారని, వెంటనే అలాంటి సీన్స్ తీసేయ్యాలన్నారు. లేకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. కాగా షూట్ ఎట్ ఆలేరు లో జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.