
టీఆర్‌ఎస్ పాలనలోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. జిల్లాలోని చెన్నూర్ మండలం నారాయణపూర్-దుగ్నెపల్లి గ్రామాల మధ్య రూ.1.83 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ..కాంగ్రెస్, టీడీపీల హయాంలో గ్రామాలకు రోడ్డు వ్యవస్థ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.