
టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ మండిపడ్డారు. రైతుల విషయంలో టీఆర్‌ఎస్ దొంగనాటకాలు ఆడుతోందన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ ఓట్ల కోసం నోట్ల కట్టలు వెదజల్లారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో గెలిచిన నేతలను కోట్లు ఇచ్చి సీఎం కేసీఆర్ కొన్నారని విమర్శించారు. లిక్కర్ ఏరులై పారిందని, అందుకే కాంగ్రెస్ గెలవలేకపోయిందని ఆయన చెప్పారు. తమ పార్టీ గొంతు నొక్కి మాట్లాడే అవకాశం లేకుండా చేశారని షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు.