
దాదాపు రూ. 31 లక్షల 26 వేల నగదును తరలిస్తున్న హవాలా ముఠాను హైదరాబాద్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. నగరంలోని సుల్తాన్‌బజార్ వద్ద రాజస్థాన్‌కు చెందిన మనీష్ తోష్నివాల్ వద్ద ఈ నగదును స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ నార్త్‌జోన్ బృందం తెలిపింది. అలాగే విష్ణుబిరాదార్ అనే మరో నిందితుడిని కూడా పట్టుకోవాల్సి ఉందని వారు పేర్కొన్నారు.