
అమెరికాలోని టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, లక్ష్మి, వీరి కుమారుడు భరత్ ప్రమాదంలో మృతి చెందినట్లు గుర్తించారు. వీరు శనివారం బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో ముగ్గురు అక్కడికక్కడమే మృతి చెందారు. అలాగే నరసిహారెడ్డి కూతురు మౌనికతో పాటు హైదరాబాద్ కు చెందిన మరో వ్యక్తి సాయి ప్రణీత్ లింగమనేని ప్రస్తుతం ఆసుపత్రిలో చకిత్స పొందుతున్నారు.