
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేలాదిగా కార్యకర్తలు హాజరు కావడంతో నగరమంతా కాషాయమయంగా మారింది. అంతకుముందు అమిత్ షా చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమిత్ షా వెంట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆ తరువాత వారాసి గూడ నుంచి సీతాఫల్ వరకు నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు.