
సీఎస్ సోమేష్‌కుమార్‌కు పీఆర్పీ కమిటీ నివేదిక ఇచ్చింది. పీఆర్సీ నివేదికను బిశ్వాల్ కమిటీ సీఎస్‌కు ఇచ్చింది. ఈ నివేదికను సీఎస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించనుంది. వారంపాటు బిశ్వాల్ కమిటీ రిపోర్టు పరిశీలించనున్నారు. జనవరి రెండో వారంలో ఉద్యోగ సంఘాలతో సీఎంవో భేటీ కానుంది. మూడోవారంలో పీఆర్సీ ప్రకటన ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గతంలో 43శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. ఫిట్‌మెంట్‌పై మూడు శ్లాబులను ప్రభుత్వానికి సమర్పించాలని కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వం సూచించిన అంకెల ఆధారంగా నివేదికకు తుది రూపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వేతన సవరణతోపాటు పదవీ విరమణ వయసు పెంపు, కేడర్ పోస్టుల అంశాలను నివేదికలో ప్రస్తావించనట్లు సమాచారం. 32 నెలల కిందట సీఆర్ బిశ్వాల్ చైర్మన్‌గా, ఉమామహేశ్వరరావు, మహ్మద్‌అలీ రఫత్ సభ్యులుగా ప్రభుత్వం తొలి పీఆర్‌సీని వేసింది. దీని గడువు ఈ నెల 31తో ముగియనుంది.