
హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేష్ ఎన్నికల షెడ్యూల్ కాసేపట్లో విడుదల కానుంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 6 న ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు పార్టీలో ఎన్నికల కమిషన్ సమావేశం నిర్వహించి పోలింగ్ పై అభిప్రాయాలు తీసుకుంది. దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల నిర్వహణకు ఓకే చెప్పారు. దీంతో హైదరాబాద్ లో ఎన్నికల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.టీఆర్ఎస్ తో సహా బీజేపీ గ్రేట్ పరిధిలో జెండా ఎగురవేయడనికి ప్రణాఝళికలు రచిస్తున్నారు. ఎవరికి వారే ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకొని ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. దుబ్బాకలో గెలిచన ఊపుతో హైదరాబాద్ లో గెలుస్తామని బీజేపీ చెబతోంది. అయితే ఆ ఓటమికి ప్రతీకారంగా ఇక్కడ మేయర్ సీటు దక్కించుకుంటామని గులాబీ నేతలు ప్రకటిస్తున్నారు.