ప్రాణనష్టం జరగనివ్వం: మంత్రి కేటీఆర్‌

భారీ వర్షాలకు హైదరాబాద్‌ అస్తవ్యస్తంగా మారింది. నగరంలోని పలు ప్రాంతల్లో వరదల తాకిడికి కొట్టుకుపోగా ఒక్కోక్క మృతదేహం బయటికి రావడం విషాదంగా మారింది. ఈ నేపథ్యంలో వరద ప్రాంతాల్లో శనివారం రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ప్రధానంగా గగన్‌పహాడ్‌లో ఆయన ఎంపీ ఓవైసీతో కలిసి పర్యటించారు. ఇక్కడ ఒకే కుటుంబంలో నలగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు మరణించారు. వారి కుటుంబ సభ్యులను మంత్రి, ఎంపీ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరదల వల్ల ప్రాణనష్టం […]

Written By: Suresh, Updated On : October 17, 2020 1:14 pm
Follow us on

భారీ వర్షాలకు హైదరాబాద్‌ అస్తవ్యస్తంగా మారింది. నగరంలోని పలు ప్రాంతల్లో వరదల తాకిడికి కొట్టుకుపోగా ఒక్కోక్క మృతదేహం బయటికి రావడం విషాదంగా మారింది. ఈ నేపథ్యంలో వరద ప్రాంతాల్లో శనివారం రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. ప్రధానంగా గగన్‌పహాడ్‌లో ఆయన ఎంపీ ఓవైసీతో కలిసి పర్యటించారు. ఇక్కడ ఒకే కుటుంబంలో నలగురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు మరణించారు. వారి కుటుంబ సభ్యులను మంత్రి, ఎంపీ పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరదల వల్ల ప్రాణనష్టం జరగడం బాధాకరమన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.