
కోవిడ్ వ్యాక్సిన్ పరిశీలనలో భాగంగా శనివారం ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ కు వచ్చారు. నగరంలోని భారత్ బయోటెక్ సంస్థను సందర్శించి ఆ తరువాత కోవాగ్గిన్ పురోగతిపై సమీక్షించారు. అనంతరం తిరుగు పయనమైన మోదీ ట్విట్టర్లో భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను అభినందించారు. కోవిడ్ నిరోధానికి స్వదేశీ వ్యాక్సిన్ తయారిలో తాము సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు వివరించారన్నారు. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిపై సంత్రుప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ తయారీకి ఐసీఎంఆర్ తో కలిసి పనిచేస్తుందన్నారు.