
జిల్లా కేంద్రంలోని ఏరియా ప్రభుత్వ దవాఖానలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 పడకల కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో కిడ్నీ పేషెంట్‌లు డయాలసిస్ కోసం హైదరాబాద్ లాంటి మహా నగరాలకు వెళ్లే వారన్నారు. ఇప్పుడు మన నిర్మల్‌లోనే అత్యాధునిక సదుపాయాలతో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.