
కుల్వకుంట్ల చంద్రశేఖరరావుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులు లేవని అన్నారు. ఎవరు డబ్బులు ఇస్తారా అని వెతుక్కునేవారన్నారు. ఒకానొక సందర్భంగా తాను కూడా ఉద్యమం కోసం కేసీఆర్‌కు డబ్బులు ఇచ్చానన్నారు. అయితే ఉద్యమం సమయంలో కొంత డబ్బును డైవర్ట్ చేశారని, ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఆ విషయం బయటకు రాలేదన్నారు.