
రైతులపై ప్రేమ ఉన్నవారెవరూ కొత్త చట్టాలను వ్యతిరేకించరని బీజేపీ మహిళా నేత డీకే అరుణ అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. సన్నవడ్లు పండించిన రైతులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్‌కు సిగ్గు సోయి ఉంటే.. పాలమూరులో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని ఉండేదన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని డీకే అరుణ ఆరోపించారు.