
నిత్యం 5వేల మంది భక్తులను శబరిమల దర్శనానికి అనుమతించనున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. డిసెంబర్ 26 తరువాత నుంచి ఆర్టీ-పీసీఆర్ కొవిడ్-19 నెగిటివ్ రిపోర్ట్ సమర్పించిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు పేర్కొంది. కేరళ హైకోర్టు సైతం ఆదివారం నుంచి నిత్యం 5 వేల మందిని దర్శనానికి అనుమతించాలని దేవస్థానం బోర్డును ఆదేశించింది. దర్శనానికి 48 గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకొని కొవిడ్-19 నెగిటివ్ రిపోర్ట్ సమర్పించిన వారికి మాత్రమే దర్శన భాగ్యం ఉంటుందని టీడీబీ అధ్యక్షుడు ఎన్ వాసు తెలిపారు.