
చేనేత పరిశ్రమను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేత ఉత్పత్తులపై రెండేండ్లపాటు జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని కోరారు. దేశవ్యాప్తంగా హ్యాండ్లూమ్ గణన చేపట్టి జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. ఈమేరకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కేటీఆర్ లేఖ రాశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మౌలికవసతుల కల్పనకు రూ.300 కోట్లు ఇవ్వాలన్నారు. సిరిసిల్లకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని లేఖలో పేర్కొన్నారు. పవర్‌లూమ్ క్లస్టర్‌ను రూ.993.65 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని, దీనికోసం రూ.49.84 కోట్లు మంజూరు చేయాలన్నారు. రూ.756 కోట్లతో పవర్‌లూమ్ అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.